యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు తగిన మెరిట్ ఆధారంగా కోచింగ్ అందించే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ, 2025 వర్సన్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నది. ఈ పరీక్ష మార్చి 23న హైదరాబాద్, విజయవాడలోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
పరీక్ష ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే విద్యార్థులకు కోర్సు ఫీజులో 75% వరకూ తగ్గింపు లభించనున్నది. ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేది మార్చి 20, 2025.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కూడా దరఖాస్తు చేయవచ్చు.
మరిన్ని వివరాలకు: 9100433442, 9100433445.

3 thoughts on “ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2025కి దరఖాస్తులు ఆహ్వానం”
Comments are closed.