అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూ టర్న్: రైతుల్లో ఆగ్రహం

atchannaidu

రాష్ట్రంలో రైతన్నలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రైతులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ.14 వేలు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది.

అన్నదాత సుఖీభవ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వివరణ ఇచ్చారు. కేంద్రం అందించే రూ.6 వేలు సహాయంతో కలిపి మొత్తం రూ.20 వేలు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశామని ఆయన తెలిపారు.

అయితే రైతన్నలు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మేనిఫెస్టోలో కేంద్రం సహాయంపై ఎక్కడా ప్రస్తావించకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు అందజేస్తామని హామీ ఇచ్చిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రూ.14 వేలు మాత్రమే అందిస్తామంటూ యూ టర్న్ తీసుకోవడాన్ని రైతన్నలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఈ నిర్ణయంతో రైతన్నల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ హక్కులు హరించుకున్నట్లు భావిస్తున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిరసనకు సిద్ధమవుతున్నారు.

READ MORE