మిథున్ రెడ్డి అరెస్ట్‌పై హోంమంత్రి అనిత స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మీడియాతో మాట్లాడుతూ, “ఆధారాలు లేకుండా ఎవరినీ పోలీసులు అరెస్టు చేయరు. ఏమైనా ఆధారాలు ఉంటే ఎవరినీ వదిలిపెట్టరు. మిథున్ రెడ్డిని కోర్టు రిమాండ్‌కు పంపించటం అనేది అందుకు నిదర్శనం,” అని తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని హోంమంత్రి తోసిపుచ్చారు. “కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలి. కేసు ప్రొసీజర్ మేరకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు,” అని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బలోపేతానికి చేపడుతున్న చర్యల్ని ఆమె వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు పనిచేస్తున్నాయని, త్వరలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లక్ష సీసీ కెమెరాలు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, ప్రతి పోలీస్ స్టేషన్‌కు రెండు డ్రోన్లు అందజేస్తామని హోంమంత్రి అనిత వివరించారు.

Read More : వైసీపీ మాజీ మంత్రులపై కేసు విచారణ..

One thought on “మిథున్ రెడ్డి అరెస్ట్‌పై హోంమంత్రి అనిత స్పష్టీకరణ

Comments are closed.