సంధ్య థియేటర్ తొక్కిసలాట: A 11, నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు పుష్ప.. రెగ్యులర్ బెయిల్ వచ్చేనా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A 11, నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్ 13న రిమాండ్ విధించబడిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో బన్నీ రిమాండ్ పూర్తి కావడంతో, ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన అరెస్టయిన కొద్ది గంటల్లోనే బెయిల్ మంజూరైంది. అలాగే ఈ ఘటనలో అరెస్టైన ముగ్గురికి కూడా బెయిల్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా పదునైన ఆయుధాలతో దాడి చేయడం వంటి సెక్షన్లు ప్రస్తుత కేసుకు వర్తించవని హైకోర్టు పేర్కొంది. నిర్లక్ష్యం వల్ల మరణం జరిగిందని భావించినా, ఆ నేరానికి గరిష్ఠ శిక్ష ఐదు సంవత్సరాలు మాత్రమే కాబట్టి, అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయడం అనుకూలంగా పేర్కొంది. ఏడేళ్ల లోపు జైలుశిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అవసరం లేదు కాబట్టి, ఇది బెయిల్ బిల్ కేసేనని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం పేర్కొంది.
