గూగుల్‌తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా, తాజా గా గూగుల్, తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో గూగుల్ తన ఐదవ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను స్థాపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఐదవ సెంటర్‌గా ఏర్పడటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సెంటర్ ఆధునిక సైబర్ భద్రతా పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడమే కాక, ఇతర కీలక రంగాలలో కూడా పనిచేయనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గూగుల్‌తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్రానికి గొప్ప గుర్తింపు లభించిందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి ప్రముఖ ఐటీ కంపెనీల కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు GSEC ప్రారంభంతో తెలంగాణ సైబర్ భద్రతా రంగంలో ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన హబ్‌గా ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుకు గూగుల్ సీఐఓ రాయల్ హాన్‌సెన్, గ్లోబల్ గూగుల్ టెక్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్, ఇతర గూగుల్ ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. ఈ సెంటర్ సైబర్ భద్రతా రంగంలో నిపుణులు, పరిశోధకుల కోసం గొప్ప వేదికగా నిలుస్తుంది. దీని ద్వారా ఆర్థిక ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయి, రాష్ట్ర డిజిటల్ భద్రతా సామర్థ్యాలు మెరుగుపడతాయి.
ఈ సెంటర్ ప్రారంభం వల్ల వేలాది ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో స్థాపించేందుకు రేవంత్ సర్కార్ చేసిన కృషికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.