కిషన్ రెడ్డి: అల్లు అర్జున్ ఎపిసోడ్.. సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సాంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేసింది. ఈ నేపథ్యములో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు.
ఈ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో రేవంత్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏబీఎన్ తో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంది అని చెప్పారు.
