హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో నైట్ పార్టీ అనంతరం యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. సికింద్రాబాద్‌కు చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు కొండాపూర్‌లోని క్వాక్ పబ్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ నైట్ పార్టీ నిర్వహించారు. అనంతరం తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి మళ్లీ మద్యం సేవించినట్లు సమాచారం.
తెల్లవారుజామున హర్షవర్ధన్‌కు తీవ్రమైన వాంతులు ప్రారంభమయ్యాయి. ఇది గమనించిన స్నేహితులు అతడిని తక్షణమే గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
హర్షవర్ధన్ సికింద్రాబాద్‌లోని ఓ ఏసీ తయారీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Read More : మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.

One thought on “హైదరాబాద్‌లో యువకుడి అనుమానాస్పద మృతి…”
Comments are closed.