భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా మే 23న పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన కచ్చితమైన దాడి గణనీయమైన నష్టం కలిగించిందని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ‘ది ఇంటెల్ ల్యాబ్’కు చెందిన జియో-ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఈ చిత్రాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
చిత్రాల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనం పై దాడి కారణంగా పైకప్పులో భాగం కూలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల భవనం లోపలనూ తీవ్రమైన నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో 26 మంది అమాయకులు మృతి చెందిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ మరియు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై లక్ష్యంగా ఉగ్రవాదులు, సైనిక సమర్థ్యాలను దెబ్బతీయడంలో భారత సాయుధ దళాలు విజయం సాధించాయి.
ఇందుకు ముందు ఇరు దేశాల మధ్య మే 8 నుంచి 11 వరకు జరిగిన తీవ్రమైన కాల్పుల్లో మే 12న కాల్పుల విరమణకు ఒప్పందం వచ్చింది. అయితే, పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని కొన్ని గంటల్లోనే ఉల్లంఘించింది.
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్, సుక్కూర్ వంటి కీలక వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. మురిద్ స్థావరం పాకిస్థాన్ వైమానిక సామర్థ్యానికి అత్యంత కీలకమైనదిగా భావించబడుతుంది. ఇక్కడ అనేక ఆధునిక ఫైటర్ జెట్లతో పాటు షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్తార్ టీబీ2ఎస్, బేరక్తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు మోహరించబడ్డాయి.
ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యంపై భారీ దెబ్బవైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


One thought on “ఉపగ్రహ చిత్రాలు నష్టం నిరూపిస్తున్నాయి.”
Comments are closed.