మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఆరోపణలు దేశ పరువు, ప్రతిష్ఠకు సంబంధించి ఉన్నాయన్న ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఘటనపై లోతుగా విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

మిల్లా మాగీ ఆరోపించిన ప్రకారం, పోటీ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన తనపై కొంతమంది ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఆమె ఈ విషయాన్ని ఇంగ్లండ్ మీడియాలో వెల్లడించగా, ఆ వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘మేం ఇక్కడ పోటీలకోసం వచ్చామో లేక మరేదోకోసం వచ్చామో అర్థం కావడం లేదు’’ అంటూ ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.

తెలంగాణ ఆతిథ్యంపై ప్రశంసలు చెబుతూ, నిర్వాహకుల తీరుపై మాత్రం గట్టిగా అభ్యంతరాలు తెలిపారు. ఈ వివాదంతో ఆమె మిస్ వరల్డ్ పోటీల నుంచి మధ్యలోనే వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు.

ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. పోటీల్లో పాల్గొన్న ఇతర దేశాల మోడల్స్‌ను కూడ విచారిస్తోంది. అవసరమైతే వీడియో రికార్డింగ్లు కూడా పరిశీలిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లను విచారణ కోసం సమన్వయ సేకరించారు. మిల్లా మాగీ హాజరైన విందు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, ఆమెతో సన్నిహితంగా ఉన్నవారి సమాచారాన్ని కూడ కమిటీ సేకరిస్తోంది. పూర్తి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఇక ఈ ఆరోపణలపై మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ స్పందిస్తూ, అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా అవి నిజం కాదని ఖండించారు. తుదిగా విచారణ పూర్తయ్యే వరకు అసలైన నిజాలు వెలుగులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.

Read More : “నన్ను వేశ్యలా చూశారు” అంటూ ఆవేదన

One thought on “మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.

Comments are closed.