వేసవి ముందే తాటి ముంజెలు మార్కెట్‌లోకి – డజను రూ.150

వేసవికి ముందే తాటి ముంజెలు అమ్మకానికి వచ్చేశాయి. సాధారణంగా రథసప్తమి తరువాత ఎండలు మండే కాలంలో వీటి అమ్మకాలు మొదలవుతాయి. అయితే ఈసారి సంక్రాంతి నుంచే తాటి చెట్ల పైనుంచి ముంజెలు తీయడం ప్రారంభించి, విక్రయాలు జరుపుతున్నారు.

తగరపువలస సమీపంలోని తాళ్లవలస ప్రాంతంలో తాటి చెట్ల నుంచి ఈ ముంజెలను తెచ్చి, సాగర్‌నగర్‌ సమీపంలోని బీచ్‌ రోడ్డులో అమ్మకాలు చేస్తున్నారు. గత వేసవిలో ఒక్క డజను ముంజెలు రూ.50కి అమ్మగా, ఈసారి అన్‌సీజన్‌లో తేచ్చడంతో వాటి ధర రూ.150కి చేరింది.

తాటి ముంజెలు వేడి కాలంలో తాగేందుకు చల్లటి పానీయంగా మారడం వల్ల వాటికి ప్రత్యేక డిమాండ్ ఉంటుందని విక్రేతలు చెబుతున్నారు.

One thought on “వేసవి ముందే తాటి ముంజెలు మార్కెట్‌లోకి – డజను రూ.150

Comments are closed.