నాదెండ్ల మనోహర్: రేషన్ మాఫియాపై సీఐడీ విచారణ
‘బియ్యం’ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఇప్పటివరకు 1066 కేసులు: నాదెండ్ల
విశాఖపట్నం, డిసెంబరు 5: కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకెళ్తున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
“ఈ ఏడాది జూన్లో నిర్వహించిన తనిఖీల తర్వాత కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై స్పష్టత వచ్చింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో గడిచిన మూడేళ్లలో 1.31 లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్గా మార్చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నాం. నిబంధనలను అతిక్రమించిన వారిపై ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేసి, 729 మందిని అరెస్టు చేశాం. 62 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం” అని మంత్రి నాదెండ్ల వివరించారు.
