ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ: భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక
ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది
‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమమైన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతినెలా చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే, ఈసారి నాలుగో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడో ఆదివారం ఆయన ఈ కార్యక్రమం 118వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ధనిక, పేద తారతమ్యం లేకుండా, కులాల పేరుతో వివక్షకు తావులేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాదిలో ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ వంటి ప్రదేశాల్లో జరుగుతుంటే, దక్షిణాదిలో గోదావరి, కృష్ణా, నర్మద, కావేరి నదులపై పుష్కరాలు నిర్వహించబడతాయని గుర్తుచేశారు.
ఈ వార్త కూడా చదవండి
