తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బి-బ్లాక్‌లో ఈ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఈ విభాగానికి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైడ్రా సంబంధిత ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడంలో మూడు కమిషనరేట్ల పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల వద్ద ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో, హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ అవసరం ఉందని కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వాన్ని కోరారు.
గత జూలై నుంచి హైడ్రా కార్యకలాపాలు మరియు పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని హోమ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ స్టేషన్‌కు ఒక ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
ఇకపై హైడ్రాకు వచ్చే ఫిర్యాదులు ఈ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే నమోదు చేయబడతాయి. హైడ్రా కమిషనర్ సూచనల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఈ పోలీస్‌స్టేషన్‌కు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
