హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదిని భద్రతా బలగాలు పట్టుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) స్పందిస్తూ, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా ఫేక్ వీడియో అని అధికారికంగా ప్రకటించారు.
TGCSB ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా… వైరల్ అవుతోన్న వీడియో తాజాగా జరిగిన మాక్ డ్రిల్‌కు సంబంధించినదిగా తేలింది. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అభ్యాసంలో భాగంగా బలగాలు చేసిన విన్యాసాలను కొందరు తప్పుడు పరిణామాలుగా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాది అరెస్టు అంటూ ప్రచారం చేశారని TGCSB వెల్లడించింది.
ఈ నేపథ్యంలో TGCSB ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే ఆధారంలేని వార్తలు, వీడియోలపై నమ్మకాన్ని ఉంచవద్దని సూచించింది. అధికారిక వర్గాల ద్వారా మాత్రమే సమాచారం ధృవీకరించుకోవాలని కోరింది. అలాగే, ఇటువంటి ఫేక్ వీడియోలు షేర్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Read More : వాతావరణ హెచ్చరికలు, 4 రోజులపాటు పరిస్థితులు.?

One thought on “శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టుకున్న వీడియో.”
Comments are closed.