కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్: ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్లో నిర్బంధ తనిఖీలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిదాడికి సమాధానం ఇచ్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఒబామా హత్యకు కుట్రలో ఆ ముగ్గురూ దోషులే

ఇటీవల కాలంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య వరుస కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పూంఛ్, రాజౌరీ వంటి జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర ముఠాలు ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ చురుకుగా మారాయి. భారత భద్రతా బలగాలు ఈ ముఠాలపై దృష్టి సారించాయి.