ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వర్షాల హెచ్చరిక: చలితీవ్రత కొనసాగనున్న ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వర్షాల హెచ్చరిక

భారత వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు.

మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో
సోమవారంలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడగా, మంగళవారం చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వెల్లడించారు.

చలితీవ్రత, గాలుల ప్రభావం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తుండడంతో, మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాయలసీమ, దక్షిణ కోస్తా వాతావరణం
ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఉండవచ్చని ప్రకటించారు.
రాయలసీమలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వర్షాల హెచ్చరిక: చలితీవ్రత కొనసాగనున్న ప్రాంతాలు

Comments are closed.