వల్లభనేని వంశీ గుంటూరు GGHలో చికిత్స పొందారు.

వైసీపీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడటంతో గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో రిమాండ్ ఖైదీలో ఉన్న వంశీ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అతన్ని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం ఈ రోజు గుంటూరు జీజీహెచ్ కు పంపారు. చికిత్స అనంతరం వంశీని విజయవాడ జైలు తరలించారు.

Read More : “మోదీ ఓట్లకంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యం”

One thought on “వల్లభనేని వంశీ గుంటూరు GGHలో చికిత్స పొందారు.

Comments are closed.