ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పేరును మళ్లీ ‘వైఎస్సార్ కడప జిల్లా’ గా పునరుద్ధరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాజాగా జీవో విడుదలైంది.
చారిత్రక గుర్తింపు తిరిగి
దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరును **‘వైఎస్సార్ కడప’**గా మార్చారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘కడప’ అనే పదాన్ని తొలగించి కేవలం **‘వైఎస్సార్ జిల్లా’**గా మార్చడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నిర్ణయంపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష హామీ – అధికారంలో ఆమలయ్యింది
అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పేరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ప్రభుత్వం పునరాలోచించి పేరు మార్చే నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు అధికారిక ఉత్తర్వులు
మంత్రివర్గ ఆమోదంతో, జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం తాజాగా అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ పరిణామంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. “కడప” అనే చారిత్రక పేరు తిరిగి చేరడంతో ప్రజల భావోద్వేగాలకు గౌరవం కలిగించినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : వల్లభనేని వంశీ గుంటూరు GGHలో చికిత్స పొందారు.

One thought on “YSR కడప పేరును తిరిగి రీఎస్టోర్ చేసిన ఏపీ ప్రభుత్వం”
Comments are closed.