తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అనుమానాస్పద అంశాలపై విచారణ జరుపుతున్న న్యాయ విచారణ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
కమిషన్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, కేసీఆర్ జూన్ 5న కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆయన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు జూన్ 6న, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలపై ప్రభుత్వం స్పందించి, 2024 మార్చిలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాణ నాణ్యత, డిజైన్, ఫైనాన్స్, నీటిపారుదల శాఖల వ్యవహారాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. కమిషన్ ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారిస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు గడువు ఏడుసార్లు పొడిగించడంతో ఈ ప్రక్రియ మరింత లోతుగా కొనసాగుతోంది.
Read More : కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.

One thought on “మాజీ సీఎం కేసీఆర్‌కి నోటీసులు”
Comments are closed.