విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి దివంగత నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వంగవీటి రంగా 78వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించిన ఆమె, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “పేదల కోసం జీవితాంతం పోరాడిన నేత వంగవీటి మోహనరంగా. ఆయన స్మరణార్థంగా విజయవాడ బైపాస్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలి” అని పేర్కొన్నారు. కాజ టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు 47.8 కిలోమీటర్ల పొడవున్న రహదారిని ‘వంగవీటి మోహనరంగా జాతీయ రహదారి’గా మార్చాలని ఆమె సూచించారు.
ఈ డిమాండ్‌ను గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. రంగా జయంతి సందర్భంగా ఈ అంశాన్ని మరొక్కసారి ప్రస్తావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read More : పవన్ మంగళగిరి చేరిక, తర్వాత పర్యటన.?

One thought on “వంగవీటి పేరిట బైపాస్‌కి పేరు పెట్టండి: షర్మిల”
Comments are closed.