విజయమ్మ 69వ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేసిన షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ 69వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. ‘నాకు జన్మనిచ్చి.. నా జన్మకు సార్థకత చేసేలా.. ఎల్లప్పుడు అండగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మా.. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని షర్మిల పోస్ట్ చేశారు.

Read More : జగన్‌కు ఈడీ నుండి భారీ ఎదురుదెబ్బ — రూ.800 కోట్ల ఆస్తులు జప్తు