లిక్కర్ స్కామ్ కేసు: రాజ్ కసిరెడ్డి వివరణ

లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో తనపై నమోదైన కేసును ఖండించారు. సిట్ కస్టోడియల్ విచారణ పేరుతో తాను అరెస్టు అయ్యానని ఆయన తెలిపారు. ఈ కేసులో తన పాత్ర ఏ మాత్రం లేదని, తాను తప్పు చేయకపోయినా తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆరోపించారు. ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో ఎప్పుడూ అరెస్టు కాలేదని స్పష్టం చేశారు.

రూ.11 కోట్లు నిజంగా నావే అయితే నా వేలిముద్రలు ఉండేవి కదా? అంత పెద్ద మొత్తం డబ్బు ఒక్కరి దగ్గర ఉండటం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు సినిమాల కథల కంటే ఎక్కువ ఊహాగానాలు చెబుతున్నారని విమర్శించారు. సిట్ విచారణ చేసిన 300 మందిలో ఎవ్వరినీ తాను ఎప్పుడూ చూడలేదని, వారిలో ఐదుగురిని తీసుకుని ‘నేను తెలుసా?’ అని అడగమని సవాల్ విసిరారు. ఈ కేసులో వినిపిస్తున్న చాలా పేర్లను తాను తొలిసారిగా వింటున్నానని రాజ్ కసిరెడ్డి స్పష్టం చేశారు.

Read More : జగన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

One thought on “లిక్కర్ స్కామ్ కేసు: రాజ్ కసిరెడ్డి వివరణ

Comments are closed.