విశాఖపట్నంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ఇప్పుడు చెత్తతో నిండిపోయి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉండే ఈ బీచ్ ప్రాంతం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, ఆహార ప్యాకెట్లతో నిండిపోయింది. సముద్రతీరానికి చేరే ప్రతి సందర్శకుడు అక్కడ మిగిలిస్తున్న మాలిన్యంతో పరిసరాలు దుర్గంధంతో కమ్ముకొని ఉన్నాయి.
స్వచ్ఛతకు మారుపేరుగా మారాల్సిన రుషికొండ బీచ్ పరిస్థితి ఇలా మారిపోవడం పట్ల స్థానికులు, పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతుండగా, మరోవైపు అసలు శుభ్రతకే తూట్లు పడుతున్న పరిస్థితి తల్లకిందులుగా మారినట్లు స్థానికులు విమర్శిస్తున్నారు.
బీచ్ శుభ్రతపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తగిన ఏర్పాట్లతో పాటు పెనాల్టీలు విధించాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. రుషికొండ బీచ్ అందాన్ని కాపాడాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More : కడపలో టీడీపీ మహిళా నాయకురాలి నిరసన..
