**వైఎస్ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు..
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటక విజయనగర జిల్లాకు చెందిన నందీపుర పీఠాధిపతులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 30న నందీపురలో నిర్మించనున్న ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేలా జగన్‌ను వారు ఆహ్వానించారు.
పీఠాధిపతులు శ్రీ డా. మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) జగన్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామచైతన్య, సహ వ్యవస్థాపకుడు వీరేష్ ఆచార్య పాల్గొన్నారు.
