న్యూయార్క్‌లో షారూఖ్ ఖాన్ సందడి!

Shah Rukh Khan Met Gala 2025

న్యూయార్క్ విమానాశ్రయంలో మెగాస్టార్ షారూఖ్ ఖాన్ దర్శనమిచ్చిన క్షణం నుండి అక్కడ సందడి మొదలైంది. ఆయనను చూసిన అభిమానులు ఎగబడుతూ సెల్ఫీలు, ఫోటోల కోసం ఉత్సాహంగా తిరిగారు. షారూఖ్ తన ప్రత్యేకమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకోగా, అభిమానులతో సరదాగా మమేకమయ్యాడు. అమెరికాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరోసారి రుజువైంది.

ఖాన్ ఈసారి సింపుల్ స్టైల్‌తో ఎట్రాక్ట్ చేశాడు. బూడిద రంగు హుడీ, నీలి కార్గోస్, మెడలో ఉన్న పెండెంట్ నెక్లెస్‌తో స్టైలిష్ లుక్‌ను ప్రదర్శించాడు. చేతిలో ఐప్యాడ్ పట్టుకొని నడుస్తున్న షారూఖ్‌లోని రాయల్టీ స్పష్టంగా కనిపించింది. కింగ్ ఎక్కడ ఉన్నా కింగేనని ఫ్యాన్స్ మరోసారి చాటి చెప్పారు.

మెట్ గాలా ఈవెంట్‌లో షారూఖ్ ఖాన్ ఎలాంటి దుస్తులు ధరిస్తాడో అన్న ఆసక్తి పెరిగింది. సబ్యసాచీ ప్రత్యేకంగా రూపొందించిన సంప్రదాయ భారతీయ వస్త్రాలు ఖాన్ ధరించనున్నట్లు సమాచారం. ప్రపంచ వేదికపై భారతీయ ఫ్యాషన్, చేనేతను షారూఖ్ ప్రదర్శించనున్నారని ప్రచారం జరుగుతోంది.

షారూఖ్‌తో కలిసి, త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మెరువనుంది. అలాగే గాయకుడు-నటుడు దిల్జిత్ దోసాంజ్ తన తొలి మెట్ గాలా కోసం సిద్ధమవుతున్నాడు. మే 5న జరగనున్న ఈ మెట్ గాలా ఈవెంట్ ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత గల వేడుకగా మారనుంది.

Read More

One thought on “న్యూయార్క్‌లో షారూఖ్ ఖాన్ సందడి!

Comments are closed.