యోగాంధ్ర కార్యక్రమంలో వసతులపై మహిళల అసంతృప్తి

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంపై ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు తమను కార్యక్రమానికి తీసుకువచ్చారని, అయితే అక్కడ తిండి, నీరు వంటి బేసిక్ వసతులు కూడా లేవని ఆగ్రహంగా చెప్పారు.

“ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు, తిండి లేదు, తిరిగి వెళ్లడానికి బస్సులు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావడంలేదు,” అంటూ ఆమె అసంతృప్తిని తెలియజేశారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాట్ల బాగోతంపై పలువురు పాల్గొన్నవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వారిని రవాణా, తినుబండారాల లాంటి మౌలిక సౌకర్యాలే లేకుండా వదిలేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం, ఇలా మౌలిక అవసరాలు కూడా చూడకపోవడంపై పునఃపరిశీలన అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై మీడియా మౌనం