వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు జరగాల్సిన భారత్–పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ రద్దయింది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ దశలో ఆటంకం లేకుండా భారత్ ముందంజ వేసింది. అయితే, సెమీఫైనల్ పోరులోనుంచి తప్పుకోవడంతో పాకిస్థాన్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టుకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించారు.
Read More : టీమిండియాతో ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్!
