ప్రకాశం బ్యారేజ్ వరద నీటితో నిండిపోవడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మొత్తం 60 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
వర్షపాతం కారణంగా పైప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు చేరడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
Read More : తురకా కిశోర్ అరెస్ట్‌పై హైకోర్టు ప్రశ్నలు

One thought on “ప్రకాశం బ్యారేజ్ నుంచి 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల”
Comments are closed.