విశాఖపట్నం వన్ టౌన్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన గ్యాస్ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఒక వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా చిందరవందరగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read More : అనంతపురంలో చిరుత సంచారం

One thought on “విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు”
Comments are closed.