గుజరాత్‌లో నిర్మిస్తున్న బుల్లెట్ రైలు మార్గంపై శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ మార్గంలో నాయిస్ బ్యారియర్ ప్యానెల్స్ ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఇప్పటివరకు 188 కిలోమీటర్ల మేర 3.77 లక్షల ప్యానెల్స్‌తో వైడక్ట్ (vidaduct) నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు మొత్తం 271 కిలోమీటర్లకు అవసరమయ్యే 5.42 లక్షల ప్యానెల్స్‌ను ఇప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ నాయిస్ బ్యారియర్ ప్యానెల్స్ వల్ల బుల్లెట్ రైలు వల్ల కలిగే శబ్దం తగ్గి, సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తుంది. ఈ పనులు పూర్తయితే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఇది ఒక కీలక దశ అవుతుంది.
Read More : ప్రధాని మోదీని కలిసిన కమల్ హాసన్

One thought on “బుల్లెట్ రైలు మార్గంలో శబ్ద కాలుష్యం నియంత్రణ”
Comments are closed.