విశాఖపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

ద్వారకా నగర్ బస్టాండ్‌లో ఒక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫామ్ పైకి అకస్మాత్తుగా దూసుకెళ్లిన బస్సు, అక్కడే నిలబడ్డ ఒక మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఘటన వివరాలు:
నిన్న విశాఖపట్నం బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన గేదెల ముత్యాలమ్మ (45)ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్టాండ్ పిల్లర్‌కు, బస్సుకి మధ్య ఆమె నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read More : రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద వైసీపీ ముట్టడి

One thought on “విశాఖపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Comments are closed.