వివేక్ అగ్నిహోత్రి కొత్త వివాదం – ది దిల్లీ ఫైల్స్‌పై భారీ నమ్మకం!

The Delhi Files

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించే ఆయన ప్రస్తుతం ‘ది దిల్లీ ఫైల్స్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే బాలీవుడ్‌ మీద ఓ సినీ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలపై వివేక్ తీవ్రంగా స్పందించారు.

ఓ మూవీ క్రిటిక్ బాలీవుడ్‌ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ వరుసగా ఫ్లాప్ చిత్రాలు విడుదల చేస్తుందని, ‘ది దిల్లీ ఫైల్స్’ కూడా డిజాస్టర్ అవుతుందని అతను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ వ్యాఖ్యలు వివేక్ అగ్నిహోత్రికి అసహనాన్ని కలిగించాయి. గత రెండేళ్లలో బాలీవుడ్ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిందని వివేక్ తేల్చి చెప్పారు. “‘పఠాన్’, ‘జవాన్’, ‘గదర్ 2’, ‘యానిమల్’, ‘స్త్రీ 2’, ‘ఛావా’ వంటి చిత్రాలు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మరి బాలీవుడ్ డౌన్ అవుతుందా?” అని ఆయన ప్రశ్నించారు.

2023లో మొత్తం ఇండియన్ సినిమా కలెక్షన్లలో 65% బాలీవుడ్ నుంచే వచ్చాయని వివేక్ పేర్కొన్నారు. ఒక సినీ విమర్శకుడు సినిమా ఫ్లాప్ కావాలని ఎందుకు కోరుకుంటారని మండిపడ్డారు.

ఇప్పటి వరకు ఎవరికీ తెలియని నిజాలను ‘ది దిల్లీ ఫైల్స్’లో చూపించనున్నానని వివేక్ స్పష్టం చేశారు. గతంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాను, ‘ది కశ్మీర్ ఫైల్స్’తో సంచలనం సృష్టించానని గుర్తు చేశారు. ఇప్పుడు ‘ది దిల్లీ ఫైల్స్’ కూడా అదే స్థాయిలో ఉండబోతుందని, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More






One thought on “వివేక్ అగ్నిహోత్రి కొత్త వివాదం – ది దిల్లీ ఫైల్స్‌పై భారీ నమ్మకం!

Comments are closed.