లెజెండరీ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం కామెడీ డ్రామా త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం ద్వారా ఆయన తన కుమారుడు రాజ గౌతమ్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
థియేట్రికల్ విడుదల అనంతరం, ఇప్పుడు ఈ సినిమా మార్చి 14, 2025 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద పరిమిత వసూళ్లు సాధించినప్పటికీ, డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.
ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్క నిర్మించగా, ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. సంగీతం శాండిల్య పిసపాటి అందించగా, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, తల్లూరి రమేశ్వరి వంటి ప్రముఖ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

One thought on “బ్రహ్మ ఆనందం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం!”
Comments are closed.