సినిమా ఇండస్ట్రీలో ఒక నటిగా కొనసాగడం ఎంత కష్టమో చెప్పడానికి పాయల్ రాజ్‌పూత్ తన అనుభవాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకుంది. “ప్రతి రోజు అనిశ్చితితో మొదలవుతుంది. ప్రతిభను కప్పిపుచ్చే ప్రపంచంలో అడుగుపెడుతూ ఉంటాను. పేరున్నవారికి ఆఫర్లు సులభంగా దక్కుతుంటాయి. కానీ ఎంతో కష్టపడినా, అంకిత భావంతో పనిచేసినా, కావాల్సిన గుర్తింపు, అవకాశాలు రావడం లేదు,” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగా అసలు అవకాశాలు అందుకోవడం సవాలుగా మారిందని ఆమె చెప్పింది.
పాయల్ రాజ్‌పూత్ గతంలో “RX 100,” “RDX లవ్,” “మంగళవారం” వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా “RX 100″లో ఆమె నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. అయితే, గత కొంతకాలంగా అవకాశాలు తగ్గినట్లు ఆమె అనుభవాన్ని పంచుకుంది. పాయల్ వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఇన్నాళ్లూ మంచి ఆఫర్లు వచ్చినా, వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నారు. కొందరేమో ఈ ట్వీట్ ఏప్రిల్ 1న పెట్టినందున, పాయల్ తన ఫాలోవర్లను పుల్ చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాయల్ 2017లో “చన్నా మేరేయ్” పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఆమెకు “RX 100” చిత్రంతో పెద్ద బ్రేక్ దక్కింది. అయితే ఇప్పుడు తాను ఎందుకు ఆఫర్లు రానని ఫీలవుతోందో, తన ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో మరింత క్లారిటీగా చెప్పడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో ఉన్న నెపోటిజంపై మరోసారి చర్చకు దారి తీసాయి.
Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️
— paayal rajput (@starlingpayal) April 1, 2025
There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…
— paayal rajput (@starlingpayal) April 1, 2025

One thought on “పదేళ్ల తర్వాత అసంతృప్తి..? నెపోటిజంపై పాయల్ రాజ్‌పూత్ ఆవేదన”
Comments are closed.