టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో సినిమా వచ్చే వార్తలు నిన్నటికీ నేటికీ చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలం క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న రూమర్స్ వచ్చాయి.
తాజాగా హిట్-3 ప్రమోషన్స్ సందర్భంగా నాని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మే 2 నుంచి ప్యారడైజ్ సినిమా షూటింగ్ ప్రారంభించి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ పూర్తయ్యాకే సుజీత్ మూవీ మొదలవుతుందని తెలిపారు.
వెంకట్ బొల్లినేని నిర్మాణంలో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా నాని-సుజీత్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని-వెంకట్ కాంబోలో ఇది రెండో సినిమా కానుంది.
ఈ ప్రాజెక్ట్ 2025లో ప్రారంభమై 2026లో విడుదల కావడం ఖాయం అని నాని వెల్లడించాడు. ప్యారడైజ్ తో పాటు వచ్చే ఏడాది నాని నుంచి మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

One thought on “పవన్ ‘ఓజీ’ తర్వాత నాని-సుజీత్ మూవీ స్టార్ట్!”
Comments are closed.