పండుగ వేళ మద్యం తాగిన అనంతరం దారుణం

విశాఖపట్నం నగరంలో హత్యోద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒక రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. మృతుడిని లోహిత్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మాధవధారలో జరుగుతున్న కుంచుమాంబ దేవాలయ పండుగ సందర్భంగా, నలుగురు వ్యక్తులు రాత్రి వరకు మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిలోని కొందరు లోహిత్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న లోహిత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం హత్యకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో శాంతిభద్రతలపై స్థానికులలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది

One thought on “పండుగ వేళ మద్యం తాగిన అనంతరం దారుణం

Comments are closed.