సీఎం, మంత్రి లోకేశ్‌ పద్మజకు నివాళి

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు.

నివాళులర్పించిన అనంతరం, చంద్రబాబు, లోకేశ్ లు నందమూరి జయకృష్ణను పరామర్శించారు. పద్మజ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పద్మజ మృతికి తమ సంతాపం తెలిపారు.

Read More : నందమూరి కుటుంబంలో విషాదం

One thought on “సీఎం, మంత్రి లోకేశ్‌ పద్మజకు నివాళి

Comments are closed.