ఇటీవల టెస్టుల నుంచి వైదొలిగిన టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గ్రేడ్ A+ కాంట్రాక్టు కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ సైకియా, “వీరంతా ఇప్పటికీ భారత క్రికెట్ వ్యవస్థలో భాగమే. అందుకే గ్రేడ్ A+ కాంట్రాక్టులోని అన్ని లాభాలు, సదుపాయాలు వారికి అందుబాటులో ఉంటాయి” అని తెలిపారు.
ఇప్పటి వరకూ బీసీసీఐ నిబంధనల ప్రకారం, మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లకే A+ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించేలా ఉండేది. అయితే ఇటీవల రోహిత్, కోహ్లీలు టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా… వన్డేలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.
వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా
2023 వన్డే వరల్డ్‌కప్‌లో తృటిలో ట్రోఫీ చేజారిన తర్వాత, రోహిత్, కోహ్లీ మళ్లీ 2027 వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. వన్డేల్లో జట్టుకు సేవలందించాలనే ఉద్దేశంతో ఆ ఫార్మాట్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయంతో వీరిద్దరి క్రికెట్ ప్రయాణం మరో నాలుగేళ్ల పాటు వన్డే ఫార్మాట్లో కొనసాగనుంది. BCCI నిర్ణయం వీరి అభిమానులకు చక్కటి ఆనందాన్ని ఇచ్చే అంశంగా మారింది.
Read More : టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ

One thought on “BCCI నుంచి సర్ప్రైజ్!”
Comments are closed.