టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో లండన్‌లో తీసినట్లు తెలుస్తోంది. ఇందులో కోహ్లీ పూర్తిగా నెరిసిన గడ్డంతో, గుర్తుపట్టలేనంతగా మారి కనిపించాడు.
ఈ ఫోటో చూసిన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కోహ్లీ వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే ఊహాగానాలకు ఇది దారి తీసింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్న కోహ్లీ.. తాజా ఫోటోతో అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాడు. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కోహ్లీ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Read More : సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్‌బై చెప్పనున్నారా?

One thought on “కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలు: గడ్డంతో వైరల్ అయిన ఫోటో”
Comments are closed.