టీమిండియా పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పరిమితం చేసే బీసీసీఐ కొత్త నిబంధనపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్యల తర్వాత, ఆయన భార్య అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.
క్రికెటర్లు వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, కుటుంబ మద్దతు ఎంతో కీలకం అని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాన్ని మరింత బలపరుస్తూ అనుష్క ‘‘కుటుంబం వేరు, సహచరులు వేరు’’ అనే అర్థం వచ్చేలా భావోద్వేగపూరిత పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘మీ కష్టాన్ని నిజంగా గుర్తించేది కుటుంబమే’’ అనే సందేశంతో ఆమె పోస్ట్ వేగంగా వైరల్ అయింది.
RCB ఇన్నోవేషన్ ల్యాబ్ – ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా, బీసీసీఐ కొత్త రూల్‌పై కోహ్లీ తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తపరిచాడు. ‘‘కుటుంబం విలువ ఏమిటో జనాలకు అర్థం కావడం లేదు. ఇలాంటి నియమాలను రూపొందించేవారిని దూరంగా ఉంచాలి,’’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
పర్యటనల సమయంలో అనుష్క, తన పిల్లలతో కలిసి కోహ్లీ మ్యాచ్‌లకు హాజరవుతుండడం తెలిసిందే. క్రికెటర్ల మానసిక ఆరోగ్యానికి కుటుంబం ఎంత అవసరమో బీసీసీఐ గ్రహించాల్సిన అవసరం ఉందని, ఈ కొత్త నిబంధన పునఃపరిశీలన చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి.

One thought on “బీసీసీఐ కొత్త రూల్‌పై కోహ్లీ అసహనం, అనుష్క స్పందన”
Comments are closed.