మెటా రే-బాన్ – ధర రూ.29,900

సాంకేతిక ప్రియులకు మరో ఆకర్షణీయమైన గ్యాడ్జెట్‌ అందుబాటులోకి వచ్చింది. సోషల్‌ మీడియా దిగ్గజం మెటా తాజాగా భారత్‌లో తన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక ఫీచర్లతో వినియోగదారులకు ఉత్తమ అనుభూతిని కలిగించేలా ఈ గ్లాసెస్‌ను రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌ ప్రారంభ ధరను రూ.29,900గా నిర్ణయించారు. రే-బాన్‌తో కలిసి మెటా అభివృద్ధి చేసిన ఈ గ్లాసెస్‌లో హై-క్వాలిటీ కెమెరా, ఆడియో స్పీకర్లు, మైక్రోఫోన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, మెటా ప్లాట్‌ఫారమ్స్‌పై నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ చేయడం వంటి ప్రత్యేక ఫంక్షనాలిటీలు ఇందులో ఉండటం విశేషం.

ఈ గ్లాసెస్‌ ద్వారా వినియోగదారులు హ్యాండ్స్‌ ఫ్రీగా తమ పనులను చేయొచ్చు. అర్బన్‌ లైఫ్‌స్టైల్‌కి సరిపోయేలా స్టైలిష్ డిజైన్‌తో తయారైన ఈ డివైస్‌, ప్రస్తుతం టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్‌లో మెటా నుంచి ఇది ఓ పెద్ద లాంచ్‌గానే భావిస్తున్నారు.

Read Mode : శాంసంగ్ నుంచి కొత్త పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్