యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిన్న యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన అభిమానులపై తన గాఢమైన ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు. “ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా మీ ప్రేమ, నమ్మకం ఎప్పటికీ అలాగే ఉంది” అంటూ అభిమానులను ఉద్దేశించి విజయ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. “జులై 31న థియేటర్లలో కలుసుకుందాం. కొంచెం భయం ఉన్నా, మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్‌పుట్‌పై మొత్తం టీమ్ సంతోషంగా ఉంది. ఈ సినిమా నా ఒక్కదాని కాదు, ఇది గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఆయన ఈ కథ ఆలోచన నుంచి ఇప్పటివరకు పర్ఫెక్ట్ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. అలాగే ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. ఆయన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిర్మాత నాగవంశీ గారు కూడా ఎక్కడా రాజీ పడకుండా మా కోసం కావాల్సిన ప్రతిదీ అందించారు. భాగ్యశ్రీ కొత్త అమ్మాయి అయినా చాలా కష్టపడి, స్మార్ట్‌గా నటించింది. భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తుంది.
నా సోదరుల్లా అనిపించిన సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకి ఆయనే సరైన ఎంపిక. వెంకటేశ్ కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. మొత్తం టీమ్ ప్రాణం పెట్టి పని చేసింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా” అని విజయ్ తెలిపారు.
Read More : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

One thought on “విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్”
Comments are closed.