ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

దేశ ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్న జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ధన్ ఖడ్ రాజీనామా లేఖను రాష్ట్రపతి సంతకం చేసి హోంమంత్రిత్వ శాఖకు పంపారు. గత సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, తన చివరి అధికారిక భాద్యతగా ధన్ ఖడ్ రాజ్యసభను చైర్మన్ హోదాలో సమర్థంగా నిర్వహించారు. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆయన అనారోగ్య కారణాల వలన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తూ, తక్షణమే ఆమోదించాలని కోరారు.

ధన్ ఖడ్ దేశానికి చేసిన సేవలను ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా, ఇతర పదవులలో ఆయన చూపిన నిబద్ధత, దేశభక్తిని ప్రధాని కొనియాడారు.

Read More : అనూహ్యంగా ఉప రాష్ట్రపతి రాజీనామా