కేరళ తిరువనంతపురం విమానాశ్రయంలో ఐదు వారాలుగా నిలిచిపోయిన బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానం చివరకు విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. సాంకేతిక సమస్యల కారణంగా జూన్ 14న అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఈ విమానం, అప్పటి నుంచి అక్కడే నిలిచిపోయింది. అనేక ప్రయత్నాల తరువాత రాయల్ నేవీ నిపుణులు చివరకు సమస్యను గుర్తించి మరమ్మతులు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రధానంగా హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆరంభంలో బ్రిటన్ నుంచి వచ్చిన నిపుణులు రిపేర్ చేయటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తర్వాత రాయల్ నేవీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వారి పర్యవేక్షణలో విమానాన్ని పూర్తిగా పరీక్షించి మరమ్మతులు చేశారు.
తాజాగా ఈ యుద్ధవిమానం విజయవంతంగా గాల్లోకి ఎగరడంతో, త్వరలోనే తిరిగి బ్రిటన్‌కు తరలించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది.
Read More : మియరిమ్ నదిలో బాలిక మృతదేహం కనుగొన్న జర్నలిస్ట్

2 thoughts on “ఐదు వారాల తరువాత గాల్లోకి లేచిన F-35”
Comments are closed.