సహజసౌందర్యంతో కోట్లాది మంది అభిమానులను మెస్మరైజ్ చేసే సాయి పల్లవి, తాజాగా తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్‌తో మరోసారి అందర్నీ అబ్బురపరిచింది. నాగ చైతన్య సరసన ఆమె నటించిన తందేల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంటనే, తన సహజ అందాన్ని మరోసారి ప్రదర్శిస్తూ న్యూమేకప్ లుక్‌లో ఉన్న ఈ చిత్రాలను షేర్ చేశారు.

సాధారణంగా ఓపెన్ చేసుకున్న జుట్ట, వైట్ టీషర్ట్ ధరించిన ఆమె స్టైల్ ఎంతో క్లాసీగా ఉంది. “ఈ బ్లాక్ అండ్ వైట్స్‌లో ఏదో ప్రత్యేకత ఉంది… అవి నిజమైన రంగులను చూపిస్తాయి 🖤” అనే క్యాప్షన్‌తో పల్లవి తన అనుభూతులను పంచుకున్నారు. ఈ లైన్స్ ఆమె లుక్‌కు మరింత గౌరవం చేకూర్చాయి.

ఇకపోతే, త్వరలో సాయి పల్లవి బాలీవుడ్‌లో రామాయణ ప్రాజెక్ట్ ద్వారా తన మాయాజాలాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు కేవలం ఓ మోనోక్రోమ్ చిత్రంతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆమె, రామాయణ ఇతిహాసంలో ఎలా కనిపిస్తుందోనన్న ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది!

One thought on “సాయి పల్లవి మోనోక్రోమ్ లుక్!”
Comments are closed.