సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా కల్పించిన స్టాపేజీల సేవలను దక్షిణ మధ్య రైల్వే మరో ఆరునెలల పాటు పొడిగించింది.
20707/20708 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గత ఫిబ్రవరిలో ఏలూరు వద్ద తాత్కాలికంగా ఇచ్చిన ఆగమన సేవలు ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో, ఈ సేవను ఆగస్టు 25వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. ఇదే విధంగా, 20833/20834 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సామర్లకోట వద్ద కల్పించిన తాత్కాలిక స్టాపేజీ కూడా ఆగస్టు 2 నుంచి మరో ఆరునెలలపాటు అందుబాటులో ఉండనుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Read More : జేపీ నడ్డాను కలిసిన రామచంద్రరావు

2 thoughts on “వందేభారత్ రైళ్లకు స్టాపేజీల కొనసాగింపు”
Comments are closed.