వనపర్తి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, మృతుడిగా భావించిన వ్యక్తి ఒక్కసారిగా కదలికలు చూపించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే, వనపర్తికి చెందిన తైలం రమేశ్ ఆదివారం అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో ఆయన మరణించారని భావించారు. ఈ విషయం తెలిసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రమేశ్‌కు నివాళులర్పించేందుకు ఇంటికి వెళ్లారు. రమేశ్ దేహంపై పూలమాల వేసే సమయంలో ఆయన శరీరంలో స్వల్ప కదలికలు గమనించారు. వెంటనే అప్రమత్తమై గట్టిగా పిలవడంతో రమేశ్ నుంచి ప్రతిస్పందన వచ్చింది.
నిరంజన్ రెడ్డి సూచనతో కుటుంబ సభ్యులు వెంటనే రమేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఆయన చైతన్యం పొందారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని తమ బంధువుకు కొత్త జీవితం ఇచ్చారని కుటుంబ సభ్యులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచే రమేశ్‌కు నిరంజన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనపై అభిమానంతో ఛాతీపై నిరంజన్ రెడ్డి చిత్రం, పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న రమేశ్, కొన్ని రోజుల క్రితం వనపర్తిలోని బంధువుల ఇంటికి వచ్చి ఈ సంఘటనకు గురయ్యాడు.
Read More : తెలంగాణలో వర్షాల బాధితులకు ఎక్స్‌గ్రేషియా.
One thought on “మృతుడని భావించిన వ్యక్తి తిరిగి బ్రతికాడు.”
Comments are closed.