ఆర్టీసీలో డిజిటల్ టికెట్ వ్యవస్థ..

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆర్టీసీ సేవల్లో సమర్థత, పారదర్శకత పెంచేందుకు కీలక అడుగు వేస్తోంది. బస్సుల్లో టికెట్ కొనుగోలుకు త్వరలోనే డిజిటల్ పేమెంట్ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మంత్రి… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తమ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ తదితర డిజిటల్ విధానాల ద్వారా టికెట్ తీసుకునేలా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఆధునిక మిషనరీని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ వ్యవస్థను అమలు చేసి, విశేష స్పందన వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత సులువైన సేవలు అందించేందుకు ఈ డిజిటల్ మార్గం ఎంతో సహాయకారిగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో ఈ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Read More : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…