రాజకీయ నాయకులు 75 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. వయోపరిమితి వచ్చిన నేతలు తాము సాధించాల్సినవి సాధించి, యువతకు అవకాశాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఆయన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి చేశారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మోదీ ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న విషయం తెలిసిందే.
భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ భవిష్యత్ దిశను సూచిస్తున్నాయా? లేదా సాధారణ సూచనగా చూడాలా? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయంగా మార్మోగుతున్నాయి. అయితే, ఆయన ఏవైనా ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారా అన్న విషయంపై స్పష్టత లేదు.
Read More : వడోదర బ్రిడ్జి ప్రమాదం విషాదం: మృతుల సంఖ్య 18కి పెరిగింది
