ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదురుదెబ్బ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కేసులో విచారణకు హాజరుకాలేదన్న కారణంతో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కోడ్ అమల్లో ఉండగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందంటూ అప్పట్లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. అయితే, తాజా విచారణ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది. న్యాయస్థానం ఆయన హాజరుకాలేదన్న విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Read More : ఆరోగ్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రికి కేసీఆర్

One thought on “ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

Comments are closed.